Tuesday, April 26, 2011

School Days : To My School With Love





భాషా రిక్షా ఆగక ముందే దుంకి వీపుకి బాగుని తగిలించుకొని చిన్న గేటు లోంచి లోపలకి అడుగెట్టగానే దారి పొడవునా రెండు వైపులా అసొకా చెట్లు స్వాగతం పలికేవి .




దూరంగా కుడి వైపు ఎలిమెంటరి స్కూలు భవనము ,ఎడమ వైపు హై స్కూలు భవనము ,వాటి రెండిటిని కలుపుతూ మద్యలో మా స్టేజి.మొత్తం వో పెద్ద కోటల వుంటుంది మా స్కూల్.ఇలొపే వాచ్ మన్ పెద్ద గేటు తెరిచాడు. స్కూలు బస్సు వచ్చి అగింది.అది సెకెండు ట్రిప్.మొత్తం మూడు ట్రిప్పులు వుండేవి.




వైట్ షర్టు ,బ్లూ నిక్కరు,బెల్టు ,టయీ ,బ్లూ సాక్స్,నల్ల బాట బూట్లు .మా స్కూలు పేరు  లొగో వుండే బెల్టు,టై.




మా క్రమసిక్షన అంతా పొద్దునే అస్సెంబ్లీలో కనపడేది.తరగతుల వారిగా వచ్చి హైటు వారిగా నిలుచునే వాల్లం.వినయంతో వందే మాతరం,చెయ్యి ముందర చాచి ప్లెడ్జి,దేశ భక్తితో జనగనమనా పాడే వాల్లం. 




క్రిస్టియన్ మిషీనరీ స్కూలు కనుక టీచ్చర్లతో పాటు సిస్టర్లు కూడా వుండే వారు.హెడ్ మిస్సెస్(మదర్) వీరందరికి పెద్ద.ఆరడుగుల ఆమెను ఎక్కడ చూసినా మాలో వినయం ,విదేయతా తన్నుకు వచ్చేవి.నాకు బాగ గుర్తు వున్న నా ఫ్యావరైట్ సిస్టర్స్ వెన్సి సిస్టర్ ,ముండా సిస్టర్.సిస్టర్ కి కోపం వచ్చినప్పుడల్ల అందరిని ముండా అని తిట్టేవారు.దాని ద్రుస్య ఆమెకు ఆ పేరు డిసైడు చేసేసారు పిల్లలు.అమ్మకు నా పై ప్రేమ పెరిగినప్పుడల్లా స్కూలుకు వచ్చి వెన్సీ సిస్టర్తో ముచ్చటించేది.అంతే వెన్సీ సిస్టర్ తొడ కొడితే నా తొడ వాచేది.ఇక్కడ మీకు చంటి గాడి కధ చెప్పాలి.


  ఈ ఫొటోలో అమాయకంగా నా పక్కనే,మూడో వరుసలు ఆకరున నిలొచొని వున్న వాడే ,వాడే నండీ చంటి గాడు.నెనేదో పెద్ద చదివే వాడినని  చంటి గాడిని నా పక్కనే కూర్చొని పెట్టారు.వెన్సీ సిస్టర్ పాటం చెప్పడంతో పాటు మాతో కూడా చదివించే వారు.ఒకరు ఆపిన వెంటనే మరొకరు అక్కడ నుంచి చదవడం మొదలెట్టాలి.చంటికి కంటి చూపు బావుండేది కాదు.పుస్తకాన్ని కల్లకి దగ్గరగా పెట్టుకు చదివే వాడు.దానికి తోడు వాడు చదివేది క్లాసు సంగతి వదిలేయండి పక్కనే కూర్చున్న నాకు కూడ వినిపించేది కాదు.చెక్కున ముగించి టక్కున కూర్చున్నాడు చంటి.నేను చదవడం మొదలెట్టగనే ప్రెమతో దగ్గరకు పిలిచారు సిస్టర్.స్కేలు విరిగింది తొడ ఎర్రగా వాచిన తరువాత గాని తెలియలేదు నేను వో పేజి వెనుక వున్నానని.


అమ్మ పంపిన లంచ్ బాక్సు ఫ్రెండుది,నాన్న కొనిచ్చిన టయ్యి చాలు మరి..


లంచ్ లో ఎవరి డబ్బా వాల్ల దగ్గర వుండేది కాదు.సాంబార్ తో మొదలెట్టిన వాల్లు చిల్లి చికెన్ తో ముగించే వారు.రోజూ క్యాంపుస్ మద్యలో బ్యాచీల వారిగా కూర్చుని లంచ్ చేసే వాల్లం.వర్షం పడితే ఎలిమెంటర్రి స్కూలు పక్కనే వున్న రేకుల షెడ్డులో కూర్చునే వాల్లం.మిగిలిన సమయంలో రీసెస్ బెల్లులో ఆటలు ఎక్కడ ఆగాయో అక్కడ నుంచే మొదలెట్టే వాల్లం.



మ్యుజిక్ పిరియడ్ లో పాటలు,అలుపే ఎరుగని ఆటలు.మద్యాహ్నం క్లాస్లు ప్రేయర్ తో మొదలెట్టే వాల్లం.SUPW-Socially Userful Productive Work.ప్రొడక్టివ్ సంగతి ఎమో కాని , ఆ అల్లికలు మాలో ప్రతిభను బయట పెట్టి మమ్మల్ని ఇరకాటంలో పడేసేవి.ఫ్లవర్ వాజు అల్లటానికి తెచ్చిన బంతితో క్రికెట్టు ఆడిన సంధర్భాలు లేకపోలేదు.




చేసిన తప్పును బట్టి సిక్షలు కక్షలూ వుండేవి..
మట్టాడిదే స్తాండప్,మాట వినకుంటే స్తాండప్ ఆన్ ద బెంచ్..
అదుపు తప్పితే నీల్డౌన్ యిన్ దా క్లాస్ ,తప్పిస్తే ఔట్సైడ్..
నిర్మలా మేడం డేవిడ్ పాల్ రాజ్ సార్ లంటే అందరికి షేక్..

పేపర్ రాకెట్లు ,బుక్ క్రికెట్,పెన్స్ ఆన్ ద బెంచి ఇలా ఏ సీజన్ కి ఆ సీజన్ లో ఫ్లూ వైరస్ లా ఒక క్లాస్ నుండి మరో క్లాస్ కి కొత్త ఆటలు సొకేవి.వాటిలో బెట్టింగు మ్యాచ్లు లేకపోలదు .కాకపొతే డబ్బు బదులు నోట్బుక్లలో పేజీలు చించి బెట్టుంగు పెట్టే వాల్లం.అలా వో సారి ఆకస్మిత తనికీలో నా బ్యాగ్లో పేపర్ల కట్ట దొరకడంతో స్టేజీ ముందు రోజంతా నీల్ డౌన్ చేసేసాం.అక్కడ కూడా ఇసుకలో నాలుగు రాళ్ళ ఆట ఆడాం అనుకోండి. 


డైరీ లో టీచరు రాసిచ్చే హోం వర్కు,పరీక్షల ప్రోగ్రెస్ రెపొర్ట్ పై నాన్న గారి సంతకం - ఆ రెండూ బ్యాన్ చెయ్యలని చాలా సార్లు చెర్చించే వాల్లం.




మా క్రియేటివిటీ అంతా గేంస్ పిరియడ్ ఆటలు కనిపెట్టడంలో కనిపించేది.జారుడు బండా పైన సిగ్మా(DD/Indian Version of StarTrek),దొంగా పోలిస్లో - తెహ్ కి కాత్  .అలా అని మమల్ని తక్కువ అంచనా వేస్తారేమో వాలి బాల్ ,బాస్కెట్ బాల్,క్రికెట్,రింగ్ బాల్ ,బాడ్మింటన్ లలో జిల్లా,స్టేట్ లెవెల్లలో కప్పులు,షిల్డులూ తరచూ తెస్తూనే వుండేవారు మా అబ్బాయిలు,అమ్మాయిలు.బ్యాటు ఎవడు తెస్తే వాడే క్రికెట్టు కింగు .అంటే రెండు సార్లు అవుటయినా చూసి చూడనట్టు ఊరుకోవాలి:).


ఎడమ వైపు గోడలకి పక్కనే టెంకాయి చెట్లు,కుడి వైపు కానక్కాయి చెట్లు .గోడల పై మన ఇండియా మ్యాప్ నుంచి అమెరికా వరకూ,ఎల్.కే.జి నుంచి బయాలజీలో మాకు పనికొచ్చే రక రకాల చిత్రాలు మమ్మల్ని ఆడుకుంటున్నప్పుడు కూడా ఆకర్షించేవి.






లాంగ్ బెల్లు కోసం వెయిటింగు,ఇంటికెల్లే ముందు షాపింగు..
లలితక్క బెల్లు ఎప్పుడు కొడుతుందా అని ప్రతి పిరియడు ఎదురు చూసినా(గేంస్ పిర్యడు తప్ప),లాంగ్ బెల్లు కోసం మటుకు కళ్ళు కాయలు కాసేట్టు ఎదురు చూసే వాల్లం.ఒక్క రకం కాదు లేండి రక రకాల కాయలు.లాంగ్ బెల్లుకి బాషా రిక్షాకి మద్యలో మరో ముక్యమయిన పని వుండేది.




అయిస్,పెప్సి,అయిస్ క్రీం,రేఖాయలు,కలేకాయలు,కంకి,సొడా,నిమ్మకాయి సోడ,లైం జూసు ఇలా రక రకాలు వుండేవి.అంటు మామిడికాయికి అయినా , జామకాయి అయినా సైజును బట్టి రేటు వుండేది.సీజన్ల తో పాటు బండ్లపై పండ్లూ,కాయలు మారిపోతుండేవి.జామకాయి అయినా ,అంటు మామిడికాయి అయినా ఉప్పుకారం వేసి ఇస్తే - "Taste Of India" లా వుండేది.రూపయి కర్చు పెట్టడానికి వో బడ్జెట్టు సమావసమే జరిగేది.అరోజుల్లో రూపయకి అంత విలువ వుండేది మరి.




భుదవారం సాయంత్రం డ్రిల్ వుండేది.రోజూలా కాకుండా ఆ రోజు వైట్ అండ్ వైట్ డ్రెస్ ,వైట్ క్యాన్వస్ షూస్ .సూపర్ స్టార్ క్రుష్న ద్యాన్సుకి ఏమాత్రం తీసిపోని ఆ డ్రిల్లు ,డేవిడ్ సార్ స్టేజి పై డ్రమ్ము వయిస్తుంటే ,పక్కనే నిలుచున్న ఎస్.పి.ఎల్ ఎలా చేస్తే అలా మేమందరం  చేసే వాల్లం.ఆ డ్రిల్ల్ ఎగగొట్టి టీచర్ల నుండి తప్పించుకొని బెంచీల కిందా ,కబోర్డ్లలో దాక్కునే వాల్లం.


శనివారం మేము ఎదురు చూసే రోజు.హాఫ్ డే అనే కాదు  ,సివిల్ డ్రస్సు డే.అంటే ఎవరు ఇష్టం వచింది వాల్లు వేసుకోవచన్నమాట.రోజు పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొచ్చే మేము ఆ రోజు మటుకు జీన్స్,బ్యాగి అలా ట్రెండును బట్టి కానిచ్చే వాల్లం.అమ్మయిలు ఇక చెప్పనక్కర్లేదు .ఏది ఏమి అయినా ఆ పద్దతి/దిసిప్లైన్/డీసెన్సీ మటుకు ఎప్పుడూ తప్పేవి కావు/తప్పనిచ్చే వల్లు కాదు టీచ్చెర్లు:).అసలు యునిఫారం యొక్క ప్రాముక్యత సాటర్డేనే తెలిసేది.




గేటుకి కుడి వైపున గోడకి ఆనుకొని  స్కూలు భవనాల వైపు చూస్తున్న చిన్న పిల్లవాడిలా వుండేది మా కాంటీన్.పప్పర్మెంట్లు ,రస్గుల్లాలు ,చిన్ని చిన్ని బొమ్మలు,సమొసాలు ,త్యాగలు తో పొదున్న రీసెస్స్ బెల్లు అయినా సయంత్రం ఇంటర్వెల్లు అయినా చినెమా హిరో చుట్టూ ఫ్యాన్స్ లా పిల్లలతో కిట కిట లడేది.ఏటా వో సారి కాంటీన్ డే మూడు కేక్లు ఆరు అయిస్ క్రీంల లా బాగా జరిగేది. యేటా వో సారి క్యాంటీన్ డే మూడు సమొసాలు అర డజన్ అయిస్ క్రీంలతో పుష్టిగా జరిగేది.




ప్రతి సంవస్తరం మొదట్లో లైబ్రరీలో పుస్తకాల తో పాటు కొత్త బెల్టు ,టయ్యి ఇచ్చేవారు.ప్రతి సంవస్తరం బెల్టు ,టయ్యి ఎందుకు? అంటార - బెల్టు విరిగేలా ఎవరు కొత్తిచుకోను వుందరెమో గాని ఆకలి వేసినా వెయ్యక పొయ్యినా టయ్యి మటుకు క్రమం తప్పకుండా తినే వాల్లం.అమ్మ కొట్టి టీచరు మొట్టితే కాని చదవని పుస్తకాలతో పాటు లైబ్రరీలో వివిద రకాల కధల పుస్తకాలు వుండేవి.ఆ కధలూ బొమ్మలు మమల్ని ఎంతో ప్రభావితం చేసేవి.






హాఫియర్లీ సెలవులకి ముందు క్రిస్టమస్సు పండుగ చాల గనంగా జరూపు కొనే వాల్లం.స్తేజీ పై డ్రమాలు ,తోలు బొమ్మలాటలు మమ్మల్ని విసేషంగా ఆకట్టు కొనేవి.అప్పుడే రిలీజ్ అయిన  హిట్ సాంగ్లుకు డ్యన్సులు  చిరు,నాగ్ల కి ఎమాత్రం తగ్గేవి కావు. ప్రతి ఫన్షన్ కీ స్టేజీ పైన పాటలు ,డ్యాన్సులు...


హై స్కూలు దగ్గర పడుతోంది అనగా క్లాస్స్ లో అసలు సంబందమే లేని వాల్లకి లింకులు పెట్టడం లాంటి పనులు చేసే వాల్లం.అలా వో సారి ఉదయ్ గాడికి నాజియాకి లింకు పెట్టి ముండా సిస్టర్ దీవెనలు అందుకున్నాను.


రిక్షా అయితే కొన్ని తీపి తిప్పలు ,బస్ అయితే మూడు ట్రిప్పులు..
కష్మీర్ నుంచి కన్యా కుమారి వరకు,నరసింహ కొండ నుంచి కోడూరు బీచ్ ,కూల్ డ్రింక్ ఫ్యాక్టరి, సోమసిల డ్యాము వరకు ప్లేస్ ఏదయినా ద్రిల్ మటుకు ఒక్కటే.తెల్లవారు జామున రేడి అయ్యి బస్సు పట్టుకొని అమ్మ ప్యాక్ చేసిన పూరీలు ,పులిహోరా,చాక్లేట్లు ,బిస్కెట్లు ఇలా పోటి పడుతూ తెచ్చిన రక రకాలు తింటూ ఆటలు,పాటలు ,మాటలు,డ్యాన్సులు పిక్నిక్ తీపి గ్నాపకాలు.



మూడవ తరగతి నుంచే ముంబై మాఫియా కి ఏమాత్రం తగ్గకుండా క్లాస్లో వర్గాలు ,గాంగ్లు.ప్రతి గాంగ్ కి వో లీడర్ ,నాయకురాలు వుండేవారు.అప్పుడప్పుడు శాంతి చర్చలు కూడా జరుగుతుండేవి.పిక్నిక్కులకి వెల్లినప్పుడు మటుకూ అవన్నీ మర్చిపొయ్యి అందరం కలసిపొయ్యి గలాటా చేసే వాల్లం




స్కూలు భవనం వెనకే పెద్ద తొటా దని పక్కనే హాస్టలు వుండేవి.పేద విద్యార్దులకి చాలా తక్కువ ఫీజు లేదా అసలు ఫిజే తీసుకొకుండా అన్ని వసతులు కల్పించే వారు.






ఎడమ వైపు గోడలకి ఆనుకొని టెంకాయి చెట్లు,కుడి వైపు కానక్కాయి చెట్లు వుంటాయి.గోడల పై మన ఇండియా నుంచి అమెరికా మ్యాప్ వరకూ,ఎల్.కే.జి నుంచి బైయాలజీ లో పనికొచ్చే రక రకాలు చిత్రాలు మమ్మల్ని ఆడుకుంటున్నప్పుడు కూడా ఆకర్షించేవి.





కాలిపోయిన బల్బులో నీల్లు నింపి ,అవతల పక్క వో ఫిల్ము పెట్టి చిరంజీవి సినెమా చూపించడం నుంచి రాబొట్ల వరకు ప్రతి సైన్సు ఫేరులో వో అయిన్శ్టీనో,అరిస్టాటిలో కనబడేవారు.




ఇండిపెండెన్స్ డే ,రిపబ్లిక్ డే లకి జండా ఆవీష్కరన తో పాటు ముక్య అతిదులుగా విచ్చేసిన డి.ఇ.ఓ,జిల్లా కలెక్టర్లు మా అందరికి చాక్లేట్లు ,బిస్కెట్లు పంచి పెట్టే వారు.ఆ రోజు భుదవారంలా వైట్ అండ్ వైట్ లో వచ్చే వాల్లం.


ఏటా వో సారి క్లాస్ ఫోటో డే వుండేది .ఇప్పట్లా డిగిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరాతో కొట్టే వంద ఫొటోలలా కాకుండా,మామూలుకెమెరాతో తీసిన ఆ ప్రతి ఒక్క ఫొటో
ఎంతో విలువైనవి.




ఏ.టీ ,యు.టీ పరీక్షల తో పాటు క్వాటర్లీ అవ్వగానే దసరా సెలవలూ ,హాఫియర్లీ అవ్వగానే క్రిస్టమస్సు/సంక్రాంతి సెలవలు ,యానువలి అయ్యాక సమ్మర్ హాలిడేస్ వుండేవి.పరిక్షలకు ముందు ఒక్క పూట బడి వుండేది.ప్రతి పరీక్షకీ రిక్షాకి మద్యలో అట్ట క్రికెట్ వుండేది.ప్యాడు బ్యాటు ,రబ్బరు బంతి లేక పొతే కొచ్చెన్ పేపరే వుండగ చుట్టి బాలు.


స్కూలు మొదలవుతుంది అనగానే కొత్త యునీఫారంలు,బూట్లు,పుస్తకాలు వాటికి అట్టలు,లేబుల్లు అభోవ్ ఒక పండుగ వాతావరనమే ఏర్పడేది.




ఆ రోజు అలా క్రమసిక్షనా ,స్నేహభావం నేర్పారు కాబట్టే , ఇ రోజు ఇలా రయ్యగలుగుతున్నాను..Dedicated to my Teachers and Friends.

Bharath