Monday, October 25, 2010
పెళ్ళి 2050:టింకు వెడ్స్ పింకి (Short Version)
"The events depicted in this story are fictitious. Any similarity to any person living or dead is merely coincidental."
Just a satire on the current trend meant for fun and not to hurt anyones feelings.
ఫేస్ బుక్ లో పరిచయం చాట్టింగ్ లో స్నేహం గా మారి, సెల్ ఫోన్ లో ప్రేమగా స్తిర పడింది.స్కైప్ లో పెద్దవాల్లు చూసేశారు,ట్విటర్ లో ఫ్రెండ్స్ కు తెలిపాడు.పెళ్ళి తాలూకూ వెబ్ సైట్ కూడా రేడి అయ్యింది.నాన్న గారి కోరిక కాదనలేక ఫార్మాలిటీ కోసం అని వో పెళ్ళి పత్రిక ప్రింట్టు చెయించాడు వేను.
ఇప్పుడు ఇది లాస్ట్ శాస్త్రి గారికి ఇచ్చి అహ్వానించకపొతే నాన్న గారు బాధపడతారు .బాధపడితే పర్వాలేదు ,కళ్యాన మండపం నుంచి కాష్మీరు హనీమూన్ వరకు కర్చులు నావే అంటారు.మూడో ప్రపంచ యుధం తర్వత 2030 లో కాష్మీర్ వెరే దేశం గా అవతరించింది.ప్రపంచంలోని అతి సుందరమయిన పర్యాటక కేంద్రంగా ఆవీర్భవించింది.
శాస్త్రి గారంటే వేనుకి ఎంతో భక్తి ఎమో గాని భయం.ఆయన గారికి తొంభై యేల్లు వుంటాయి .ఆ వయస్సు లో కూడా మొహం లో తేజస్సు ,మాటల్లో హుషారు తో కూడిన వేదాంతం వుట్టి పడుతుంటాయి.తాతయ్యగారికి , నాన్న గారికి చిన్నపటి గురువు.ఆయనే ఈ యుగానికి నిజమైన ఆకరి శాస్త్రి అని అందరూ అలా లాస్ట్ శాస్త్రి అని పిలుస్తుంటారు.
సో మనసుకు ధైర్యం చెప్పుకొని ,గుండెను రాయి చేసుకొని లాస్ట్ శాస్త్రి గారి ఇంటికి వెళ్లాడు వేను. భాగవతం చదువుకుంటున్న ఆయనను పలకరించే ధైర్యం లేక కాసేపు ఎదురు చూసి చేతులు వనుకుతూ ఇన్వైట్ ఆయన హ్యండ్స్ లో పెట్టాడు వేను. ఆయనలో వేను వో అల్ట్రా సౌండ్/ఎం.ఆర్ .ఐ స్కానింగు మిషీన్లు చూసుకుంటూండగానే పై నుంచి కింద దాక వో పది సెకండ్ల లో చదివేసి తలెత్తి కోపంగా వేను వైపు చూసాడు.
టింకు వెడ్స్ పింకి - ఎంట్రా ఇది ఇంటి పేరు సంగతి సరే సరి అసలు పేరు ఏమయింది రా?.ఒక తిది లేదు, ముహుర్తం లేదు,పెద్ద వాల్ల పేర్లు లేవు.ఇది ఎలా వుంది అంటే - నేనొక అనాధని.ఎలా పుట్టానో ,ఎవరికి పుట్టానో తెలీదు.నాకు ఎవ్వరూ లేరు .నాకు ఒకత్తి దొరికింది.అదీ దిక్కు మాలిందే,దానికీ ఎవ్వరూ లేరు.సో అసలు ప్రబ్లంసే లేవు అన్నటుంది.
డిన్నర్ ఫాలోస్ - అంటే ఎంట్రా ?అన్నదాన కార్యక్రమమ?. పనీ బాటా లేకుండా తిండి కోసం పదేళ్ల నుంచి అలమటిస్తున్న మాలాంటి వాల్లు వచ్చి బోంచేసి వెల్తే చాలనా ?.అశీర్వాదాలు గట్రా అవసరం లేదా?
బయటకు వస్తూ నవ్వుతూ,చెవుల లోంచి మైక్రో బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ తిసేశాడు వెను.
ముహూర్త వేల రానే వచ్చింది..
వేను వెడ్స్ స్మిత
లాస్ట్ శాస్త్రి గారు యాక్సెస్ కార్డు ఫ్లాష్ చేసి మండపం లోపలకి అడుగెట్టగానే రెండు వైపుల నుంచి నీళ్ళు వచ్చి ఆయన నెత్తిన పడ్డాయి.మొదట ఉలిక్కిపడి ,తరువాత అవి సెన్సార్తో పనిచెసే పన్నీరు మిషీన్లని తెలుసుకొని నసుక్కుంటూ లోపలికి వెల్లాడు.
వేను, స్మితా పెళ్ళి పందిరిలో అడుగెట్టే సమయానికి మండపం అతిదులతో నెండిపోయింది.
మండపానికి నాలుగు వైపులా నాలుగు ఆటోమ్యాటిక్ కెమెరాలు అమర్చి వున్నాయి.అవి ఆర్టిఫిసీల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎప్పుడు తియ్యాలో అప్పుడు చక చకా ఫొటోలు విడియొలు తియ్యడం ప్రారంబించాయి.
పురోహితుడు ఐపోడ్ స్పీకర్ డాక్ కి కనెక్టు చేసి , మంత్రాల ప్లేలిస్టు సెలెక్టు చేశాడు.మరో ఐపోడ్ లో రాం చరన్ తెజ కూతురు నటించిన అతిలోక సుందరి జగదేక వీరుడు సినెమా పాటలు ప్లే చేసి యియర్ ఫోన్లు చెవుల్లో పెట్టుకొంటూ ఫొటోలకి ఫోజులు ఇవ్వడం మొదలెట్టాడు.
విమానానికి బ్లాక్ బాక్స్ వున్నట్టు ప్రతి పెళ్ళి మండపానికి వో బ్లాక్ బాక్స్ రూం వుంటుంది.పెళ్ళి కొడుకు తండ్రి పెళ్ళి కూతురి తండ్రికి సూట్ కేస్లు ఇవ్వటానికి,ఆన్లైన్ డబ్బు ట్రాన్స్ఫర్ చేయటానికి సౌకర్యాలు వుంటాయి.అంటే కట్న కానుకలన్నమాట - కన్యాసుల్కం.ఇ గదిలో తెహెల్కా కెమెరాలు పని చెయ్యవ్,అ పక్కనే అన్ని బ్యాంక్ల లోన్ ఏజెంట్ల ఆఫీస్లు వుంటాయి.
మాంగళ్య ధారన మంత్రాలు వినబతూండగానే అక్షంతలు బదులు వో డబ్బా అతిదుల చేతిలో పెట్టారు,నాన్ వెజ్ అయితే చికెన్ పీస్ , వెజెటేరీన్ ఐతే చిక్ పీస్,వో స్యాండ్ విచ్,వో హెర్షీ చాక్లేట్ అందులో వున్నాయి.
బంగారు రేటు నింగికే ఆకాశాన్ని అంటడంతో నాన్న గారు లైఫ్ లో గెలచిన ఏకైక గోల్డ్ మెడల్ కరిగించి తయారు చేయించినా తాళి స్మితా మెడలో ఆనందంగా కట్టేశాడు వేను.
బాబు పోరికి అరుంధతీ తార చూపించరాదే అని పురోహితుడు అనగానే మండపం పై కప్పు ప్లానిటోరియం లొ లా నక్షత్రాలతో నెండిపొయింది. వాటి మద్యలో అందంగా మెరుస్తున్న అరుంధతీ నక్షత్రాన్ని స్మితకు చూపించాడు వేను.
అతిదులు తెచ్చిన గిఫ్టులు మండపానికి ఎడమ వైపు పెట్టి కుడి వైపు వాల్ల కోసం వుంచిన గిఫ్ట్ బ్యాగ్లు తీసుకొని కంగ్రాట్స్ అంటూ ఒకొక్కరు వెలుపలకి నడిచారు.
బయట మెట్ల దగ్గర రెండు వైపుల వున్న కెమెరాల వైపు చూస్తూ ఒకరు కేక అంటే, ఒకరు సూపరు అంటే ,మరొకరు 100 యియర్స్ నడుస్తుంది ఇ జంట అంటూ పార్కింగు లాట్ కు తీసుకెల్లే రైల్లో ఎక్కేశారు.ఆకరిగా లాస్ట్ శాస్త్రి గారు వచ్చి రెండు కెమెరాల వైపు కాసేపు కోపంగా చూసి రైలు ఎక్కేశారు.
ఆకరిగా వేను ,స్మిత అండ్ ఫ్యమిలి బయటకు వచ్చిన వెంటనే ఆ కెమెరా మిషీన్ల లోంచి రాబొటిక్ చేతులు బయటకు వచ్చి కంగ్రాట్స్ అంటూ స్మితా చేతిలో ఫైనల్ ఎడిటెడ్ విత్ స్పెషల్ సౌండ్/మ్యుజిక్ ట్రాక్ విడియో/ఫొటోల సీడి,వేను చేతిలో ఫైనల్ బిల్లు పెట్టాయి.
నాని
Labels:
తెలుగులో