Sunday, April 25, 2010

Sunday is for mom made dosa and chicken....







సెట్టమ్మ పోసేది ఎర్రకారం దోశ... 
మురళి క్రిష్నాలో తెస్తే రవ్వ-మసాల దోశ.. 
హాస్టల్లో పెట్టారు నిదురబుచ్చే దోశ.. 
ఎడిసన్ చేరాక కీమా రొయ్యల దోశ... 
వీటన్నింటినీ మరపించేదే ఆదివారం అమ్మ చేతి దోశ....




స్కూలున్నపుడు అమ్మ విస్సుకోని నాన్న ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే కాని నిద్ర లేయని మేము ,ఆదివారం నాన్న గారు చికెన్ తేవడానికి వెల్తున్నారు అనగానే ఇట్టే లేసి అట్టే రేడీ అయ్యిపొయేవాల్లం.అది 1982లో పెదనాన్న గారు నాన గారికి ఇచ్చిన బజాజ్ చేతక్ .పేరుకి చేతక్ అయిన మాకు మటుకు అది బజాజ్ పుష్పక్.మనసుకి ఎక్కడికి వెల్లాలనిపిస్తే అక్కడికి సెరవేగంగా వెల్లిపొయేవాల్లం. తమ్ముడు హ్యాండిల్ పట్టుకుని ముందు నిలుచున్నాడు,వెనక సీట్ ఎక్కేసి నాన్న నడుము చుట్టూ చేతులు వేసి నేను రెడీ అయ్యాను.కిక్ కొట్టగానే మొదట పొగ వచ్చింది ,తరువాత డి.కె.మ కలాశాల ఇంకాస్త దూరం వెల్లగానే మా స్కూలు వచ్చాయి. సూర్య కిరణాలు తాకి ఆవిరవుతున్న మంచు చినుకులు గాలిలో తేమలా మొహానికి తగులుతూంటే మనసు ఆనందంతో నెండిపోయేది. ఇంకాస్తా దూరం పొదలకూరు రోడ్డు పై వెల్లగనే రోడ్డుకి కుడి వైపు భాషా భై చికెన్ షాప్.కేజి బ్రయిలర్ 50 రూ అన్న బోర్డు పక్కనే స్కూటర్ స్టాండు వేసి నాన్న భాష భై వైపు చూడగానే అర కేజీ చికెన్ కొట్టి ప్యాక్ చేసేశాడు.






అమ్మ మొదటి దోశ పోయడం మొదలవ్వగానే నాన్న ఎర్రగడ్డ ముక్కలు రెడీ చేసేవారు.అమ్మ చేతి దోశలు పల్చంగా నొట్లో పెట్టడమే ఆలస్యం కరిగి పోయేలా వుంటాయి.దోశలు,వేడి వేడి చికెన్ కూర,పక్కనే వాటి కజిన్ ఉల్లిపాయలు..ఒక ప్లేట్లో అంతకంటే ఇంక ఏమి కావాలి చెప్పండి. ఇలా మొదటి దోశ రెడి అవ్వుతోంది అనగనే చరన్ వచ్చేవాడు.ఇంటి వోనర్ గారి మనవడు మా బాల్య స్నేహితుడు.వాల్ల ఇంట్లో మాంసాహారం తినరు ,కాని స్నహితులలతో పాటు వాల్ల అలువాట్లు కూడ వచ్చేస్తాయి కదా...:).అమ్మ దొశా చికెన్ అంటే చరన్ కి చాలా ఇష్టం.ఆ ఇష్టం కొద్ది రోజుల లోనే చరన్ తాతయ్యగారికి కూడ సోకడంతో హోటల్ నుంచి చికెన్ తెచ్చుకోవడం అరంభించారు.ఇంకొన్ని రోజుల తరువాత అమ్మదగ్గర చికెన్ చిట్కాలు తెలుసుకొని ఆంటీ ఇంట్లొనే దొశా చికెన్ చేశేశారు.అది అమ్మ చసే దోశా చికెన్ ఎఫెక్ట్టు...


నాని