Saturday, June 20, 2009

మా నలుగు:-అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి..






సమయం:-From india to india.When my Brothers 'wedding invite' and our upcoming trip to home sweet home finally pulled the trigger on my loaded pen which wanted to spit this out for quiet some time:)

లొకేషన్:-అబ్బాయేమో వింజమూరులో,అమ్మయేమో నెల్లూరులో.....


స్నానం చేసి తలతుడుకుంటూ ఇంట్లోకి పరిగెడుతుంటే ఆరు బయట అమ్మ అత్తమ్మ వాల్లతో కలసి ముగ్గు వేస్తూ కనిపించారు.ప్రతి ఏటా మేము ఎంతో గనంగా జరుపుకొనే సంక్రాతి పండుగ వాతావరంతో నా మనస్సు నెండి పోయింది..



తెల్లవారు జామున నాలుగు గంటలకి నిద్ర లేపేశారు అమ్మ.తోడు పెళ్ళి కొడుకు సూర్య,గజిని సూర్య కాదు.చిన్నపుడు రొజంతా నేను ఎత్తుకోని అడుకోని టాటా చెప్పయక ముందే గుక్క పెట్టి ఎడ్చే వాడు మా మెనతామ్మ గారి అబ్బాయి మేమందరం ముద్దుగా పిలుచుకొనే అబ్బయ్య అలియాస్ సూర్య తేజ.




నాలుగు గంటలకి ఎవరు నిద్రలేస్తరు అంకుంటారెమో ,మా ఊరు వింజమూరులో, వీది చివర మొదటి టీ వడకట్టేది నాలుగు గంతలకే ,ఆకు తోటలో మొదటి ఆకు తుంచేది నాలుగు గంటలకే.తిరుమల దర్శనకో, బోగి పండుగకో తప్పా నా సంగతి అందరికంటే ఎక్కువ తెలిసిన అమ్మ ఎప్పుడూ నన్ను ఇంత పొద్దునే నిద్రలేపలెదు.



అమ్మతో మొదలయ్యి మేనత్తల్ల నుంచి బాబాయిల వరకు,నానమ్మల నుంచి పిన్ని ల వరకూ ,నాన్న నుంచి తాతయ్యల వరకు అందరూ హోలి పండుగా లా ఫీల్ అయ్యిపొయ్యి నూనె- సున్ను పిండి-పసుపు పూసేస్తూ అక్షంతలు వేసేశారు ...

తలంటు స్నానం చేసి నలుగు దుస్తులు చూడగానే షాపింగ్ @@@Flashback



చెన్నై లో ఇలా బ్రిటీషు వారి ఫ్లైటు దిగి స్వదేశపు గాలి హాయిగా పీల్చే లోపే నాన్న , బన్సాలిబాబు అంకుల్ నన్ను కింగ్ ఫిషర్ ఫ్లైటు ఎక్కించేశారు హైదరాబాదుకి.అమ్మతో కలసి పెళ్ళి షాపింగ్ చెయ్యడానికి అక్కడ రంగం సిద్దంగా వుంది. తన మారుతి కార్-(దాని గురించి ప్రత్యేకంగా వో టాపా నే రాయొచ్చు) తో పాటు ఎదురు చూస్తున్న తమ్ముడితో కలసి హైదరాబాదు రొడ్ల పై ట్రాఫిక్కులో విన్యాశాలు చేస్తూ ఇంటికి చేరుకున్నాము.

ఇక్కడ అబ్బాయి షాపింగ్...

స్పర్శ కొన్న చీరల అంచులనుంచి రంగుల వరకు అన్ని మనసులో పెట్టుకొని రంగం లోకి దిగము....






మెహ్బాజ్ లో షెరవాని..అమ్మకి అది చూడగానే నచాఎసింది.ట్రయిల్ రూం అద్దం ముందు నిలుచుంటే నాకొసమే రాజస్తాన్ నుంచి దిగబడింది, అదే దిగుమతి అయిందెమో అనిపించ్చేసింది.ఆరోజులలో మహారాజులు దరించే దుస్తులకి ఏమాత్రం తీసిపోకుండా,వంటికి అతుక్కునిపొతున్నట్లుగా నెహ్రు కాలర్ తో మెడ దగ్గర మొదలయ్యి రక రకాల ముత్యపు రాల్లతో ఎంతో అందంగా మెషీనుతో కాకుండా చేతో నేసిన ఎంబ్రాయిడరీ వర్క్తో మోకాలు వరకు నెండిపోయింది.కల కల లాడే నా మొహంలోని ఆనందాన్ని చూసి,దానికి మ్యాచింగు చురిదార్ మరియు జోద్పూరీలు చూపడం మొదలెట్టారు అహ్మద్ బాయ్.తల పాగా లేని పెళ్ళి కొడుకు కిరీటం లేని రాజు లాంటి వాడే.అందుకే మ్యాచింగు తల పాగ ప్యాక్ చేయించేశాం.



పెళ్ళికి ఇన్ని కొంటే రిసెప్షను ఫీల్ అవ్వదు? అవ్వదు ఎందుకంటే దానికి వో 3 పీస్ సూట్ కొనెశాం గా.









ఇలా గడియారం లో ముల్లులతో పాటు తిరిగేస్తూ చక చకా నలుగు కి రేడి మేడ్ పంచ ,మరో కుర్తా కి కొలతలు ఇచ్చేసి రైలు ఎక్కేశాం.





ఇలా ముస్తాబయ్యి బయటకి వస్తుంటే ఎర్రపంచ లోంచి సన్నాయి సెబ్దాలు వినిపించాయి.ఇ రోజు మొదలయ్యిన బ్యాండు మేలం పెళ్ళి గడియలు దాకా మాకు తోడు గా వుండి పోయాయి...


నలుగు గెట్ అప్ లో కొత్త పెళ్ళి కొడుకు కిందకి రాగానే అమమ్మ మొదట దిస్టి తీసేయమన్నారు..అమమ్మ చిన్నపటి నుంచీ అంతే.నా చిన్నపటి నుంచీ:)




పెళ్ళి నెల్లురి లో వుండటంతో మా ఊరిలో బందు మిత్రులకందరికీ బస్టాండు దగ్గర అప్పుడే రెడీ అవుతున్న మండపంలో బోజనాలు ఎర్పాటు చేశేరు.వో అయిదు వేల మంది దాక మా ఆతిద్యం స్వీకరించి ఆశీర్వదించారు.





అక్కడ అమ్మాయి -

సున్నుపిండి,నునే కార్యక్రమం తరువాత,స్పర్శ ని అమ్మ,పిన్ని ,అత్తమ్మలు పెళ్ళి కూతురిలా ... కంచి నుంచి పట్టు జరీ తో దగ దగ లాడుతూ వచ్చిన - రోజా కొమ్మని పువ్వు నీ కలిపేసినటువంటి రంగు చీరలో,అందమైన పొడవాటి పూల జడతో కుందనపు బొమ్మలా రేడి చేసేశారు పిల్ల నలుగుకి.

చోటి అంటే చిన్నపటి నుంచీ ఎంతో ఇసపడే పిన్ని అలియాస్ విజయ లక్ష్మి,నలుగు మెహంది రెండు తన ఇంట్లోనే జరగాలని పట్టుపట్టదంతో ఇంటి ముంగిట పందిరి, వీధి చివరవరకు కార్లు మేడ మీద కుర్చీలు ,వాటిపై అక్షంతలు చేతపట్టుకొని బోజనాలకి ఎదురు చూస్తున్న జనాలు సిద్దమయ్యారు..:)

వాల్లందరితో పాటు స్పర్శని నేను కూడ ఆసీర్వదించేశాను ,తనతో కలసి అందరి ఆసీర్వాదాలు అందుకున్నాను.ఇక్కడకి ఎలా వచ్చాననుకుంటున్నారా ? ,నా నలుగు ముందర రొజే అయ్యిపొయింది మరి:).ఒక్కసారి కమ్మిట్ అయ్యాక నలుగైన తను వేసు ప్రతి చిన్ని అడుగైనా తోడు వుండాలి మరి...!!

అలా ఆశిర్వదిస్తూ అమమ్మా అన్న మాటలు - 'నా ప్రానాన్ని నీ చేతిలో పెడుతున్నా' ఎప్పటికి గుర్తుకు వుండిపొతాయి....

సో ఇలా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయీ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకులా రేడీ అయ్యారు....

ఇంకేముంది అరోజు సాయంకాలం మెహంది సంబరాల కోసం ఏర్పాట్లు సెర వేగం గా మొదలయ్యాయి...

నా<-->ని