Saturday, February 7, 2009

లేక్ హౌస్:- హాట్ స్ప్రింగ్స్/లిటిల్ రాక్,ఇది చాల హాటు గురు....



లొకేషన్:-హాట్ స్ప్రింగ్స్,లిటిల్ రాక్,ఆర్కెన్సాస్
సమయం:-చిన్నపటి కల నిజమయ్యిన వేల,నివ్ యియర్ 2007.

నేను అమెరికా కి రావడంలో పెద్ద విశేషం ఎమి లేదు,చిన్నపటి నుంచే ఎప్పుడోవకప్పుడు నాకు ఇక్కడకి రాక తప్పదని తెలుసు.ఎందుకంటే నేను ఇంజినీరింగు మొదలెట్టక ముందే అమ్మ అలా డిసైడు అయ్యిపోయింది కాబట్టి:).అలా డిసైడు అవ్వడానికి కారం ఒకరు మా ఆస్టిన్ పిన్ని ఐతే ,మరొకరు మా లిటిల్ రాక్ జ్యోతి పెదమ్మ...

She is our fairy god mother..

చిన్నపుడు అమెరికా అంటే మాకు(నాకు , తమ్ముడికి) తెలిసిందల్లా జ్యొతి పెదమ్మ,పెదనాన్న,వంశీ,రాహులు...

మాటలు చెప్పే స్పీక్ అండ్ స్పెల్ నుంచి రాక్ బ్యాండు కీబోర్డ్ల వరకు ...

బేసిక్ బాష మాట్లడే కంపుటర్ నుంచి లేటెస్టు యానిమేటెడ్ ఇంగ్లిషు సినెమాల వరకు అన్ని ఆమె ద్వారనే తెలిసేవి మాకు.వారంతం వారాంతం జ్యొతి ఆంటీ ఫోన్ వచ్చిందంటే చదువునుంచి మాకు రెండు గంటలు విరామం ప్రకటిస్తుంది అమ్మ.అందుకే ఆ కాల్ కోసం అమ్మ కంటే ఎక్కువ మెమే ఎదురు చూసే వాల్లం.





నివ్ యియర్ 2007

ఎప్పటిలానే క్రిస్టమస్ సెలవులకి పిన్ని వాల్ల ఊరు , అదే మన ఆస్టిన్ వెల్లి ,నివ్ యియర్ టైం కి లిటిల్ రాక్ చేరుకున్నాను.లిటిల్ రాక్ అంటే లిటిల్ రాక్ నుంచి వో గంట దూరం లో వున్న హాట్ స్ప్రింగ్స్...

జ్యోతి ఆంటీ కార్లో యయిర్పోర్టు నుంచి ఇంటికి వెల్తూ వుంటే,రెండు సంవస్తరాలకి వో సారి వాల్లు ఇండియాకి వచ్చినప్పుడల్లా,రాహుల్ ,వంశీలతో కలసి మేము చేసే అల్లరి గుర్తుకువచ్చింది....





లేక్ హౌస్...

పెదమ్మ వాల్ల అందమైయిన లేక్ హౌస్ లోకి మొదటి సారి అడుగుపెట్టాను........

లేక్ హ్యామిల్టన్ కి ఆనుకొని అందులో బాగమెమో అనేలా వున్న ఇంటి బాల్కని లోకి వెల్తే లోపలకి రాబుద్ది కాదు .ఫొటో స్తుడియో లో బ్యాక్ గ్రౌండ్లలా ఎటు చూసినా ఇంకో వైపు చూడాలనిపివ్వనట్టుగా వుంది వివ్...

మరో నాలుగు అడుగులు వేసి బోట్ షెడ్లోకి వెల్తే...జెట్ స్కీలు ,వో సారి ఫ్లొరిడా గుర్తు తెచుకొంటూ రంగంలోకి దిగాము యువ సెన అంతా....




అలా పోటీ పడి జెట్ స్కీ రౌండ్లు వేస్తూ చిన్నపుడు హైదరాబాదు ఓషన్ పార్కులో అందరం కలసి చేసిన విన్యాసాలు గుర్తుకు తెచ్చుకున్నాము....




రెండవ రోజు హాట్ స్ప్రింగ్స్ డౌంటౌన్ విహార యాత్ర మా లిటిల్ కసిన్ వంశి నేపద్యంలో మొదలయ్యింది...

వంశితో కలసి కాస్తా ట్రెక్కింగు చేసేసి,హాట్ స్ప్రింగ్స్ మౌంటైన్ టవర్ పై నుంచి డౌంటౌన్ చూస్తుంటే తిరుమల కొండ ఎక్కుతూ తిరుపతిని చూసినట్టు మబ్బుల మద్యలోంచి భవనాలు చిన్ని చిన్నిగా బొమ్మరిల్లలా కనిపించాయి...





సహజ సాదారననంగా ఏర్పడిన ఈ వేడి నీటి జలపాతాలని తిలకించటానికే ఎంతో దూరం నుంచి ఇక్కడకి వచ్చే పర్యాటకులతో కిట కిట లాడుతొంది డౌంటౌన్.వీల్లలో ఆ నీటిని బాటిల్లు బాతిల్లలో నింపెసుకొని తీసుకు వెల్లే వాల్లు లేకపొలేదు.ఎందుకంటే ఆ నీటిలో ఎన్నో జబ్బులని నయం చేసే ఔషదాలు వుంటాయి..





ఎప్పుడూ జులై 4 న కలుసుకునే రాహుల్ , వంశి స్నేహిల్తులందరూ ఇసారి నివ్ యియర్ పార్టి కలసి చేసుకోవాలి అని దెసైడు అవ్వడంతో పెదమ్మ దానికి తగిన బందోబస్తు చేసేశారు....


హోం థియేటర్...

అప్పటి వరకు హోం థియేటర్ అంటే నాలుగు స్పీకర్లు వెనకాల , రెండు స్పీకర్లు ముందర వుంటే చాలు అనుకొనే నాకు ఆ గదిలోకి వెల్లగానే బెంగులురు పి.వి.ఆర్ సినెమస్ రాయల్(500 రూ టికెట్టు) లోకి వచ్చేశానెమో అన్నట్లు అనిపించింది.


నింటెండో ' వీ '

వీ ని కలవడం అది మొదటి సారి కానప్పటికీ అంత పెద్ద స్క్రీన్ లో బేస్-బాల్ ఆడుతుంటే యాంకీ స్టేడియం లో వున్న ఫీలింగ్ కలిగింది.ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాతావరనం వేడెక్కి హోరా హోరీగా సాగి బిగినర్స్ లక్ నా వైపు వుండదంతో గెలుపు నన్నే వరించింది...



టీటి బల్ల పైన ఎర్పాటు చేసిన వార్ గేం నన్ను ఎంత గానో ఆకట్టుకుంది.అప్పుడెప్పుడో కంపుటర్లో ఆడిన యేజ్ ఆఫ్ దా ఎంపైర్స్ గేం ని మరపించింది.....


నివ్ యియర్ పార్టి హ్యాంగ్ ఓవర్ నుంచి అప్పుడప్పుడే బయట పడుతున్న మమ్మలని ఫేమస్ ఇటాలియన్ రెస్టారెంట్ ఆలివ్ గార్డంకి తీసుకువెల్లారు పెదమ్మ వాల్లు..

అదే నా మొదటి ఆర్కెన్సాస్ ట్రిప్ కి ఫేరెవెల్ పార్టి.ఇలా మొదటి సారి పెదమ్మవాల్లని వాల్ల మెట్టినిల్లు అయిన లిటిల్ రాక్ లో కలవడం నా అమెరికన్ చాప్టర్లో మరవలేని మరో పేజీని ఇలా నమోదు అయ్యింది........


Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


First Ski


Kerala


Wild Wild West 1


Denver The Mile High City


Ocean City