Sunday, October 5, 2008

వైల్డ్ వైల్డ్ వెస్ట్ 1:-మిక్కితో సావాసం,వేగస్లో ఉల్లాసం...


సమయం:- 2006 ధ్యాంక్స్ గివింగ్
లొకేషన్:-LA నుంచీ వేగస్ వరకూ...

ఈ "నా కెమెరా ఈ ప్రపంచం" సెక్షన్ని ఈ ట్రిప్పుతో మొదలెట్టటానికి కారనం మా అనీల్ గాడు...

అస్తమిస్తున్న సూర్యుని సైతం,వెలుగుతో నింపగల మన స్నేహం....

ద్యాంక్స్-గివింగ్ అంటే నాకు అదో ఎక్ట్రా జోష్ వచ్చేస్తది , నాకే కాదు నాలుగు రోజులు సెలవలు అంటే యే సాఫ్టువేరు ఇంజినీరుకి మటుకు జోష్ రాదు చెప్పండి.ఇ జోష్ లోనే నా వీసా స్టాంపింగ్ నిమిషంలో చేసేశారు చెన్నై అమెరికన్యంబస్సిలో ఒకప్పుడు :).ఇ జోష్తో పాటూ చిన్నపటి బెస్టు ఫ్రెండుని పది సంవస్తరాల తరవాత కలుస్తున్నా అనే ఫీలింగ్తో ఫిల్లడల్ఫియా ఇంటర్నేషనల్ యయిర్పొర్ట్ నుంచి బయలుదేరాము వైల్డ్ వైల్డ్ వెస్ట్ కి.

నాతోపాటు వచ్చిన నా రూమేట్ సుమంత్ తో కబుర్లు చెప్పుకుంటూ ల్యాప్టాపులో సినిమాలు చోస్తూ, అయిదు గంటలలోలాస్ వేగాస్ చేరుకున్నము.ఫ్లైట్ మారడనికి టెర్మినల్కి వెల్తుంటే అది యయిర్పొర్ట్ కి తక్కువ కెసినోకి ఎక్కువలా వుంది.మరో గంటసేపు ఫ్లై చేసి LA చేరుకున్నాము.
ఆ తూరుపుకి ఈ పడమర ఎంత దూరమో ,ఈ తూరుపుకి ఈ పడమర అంతే దూరం అనిపించింది.

అనీల్:-
10త్ క్లాస్లో నా పేపర్ ని వాడి పేపర్ లా చూసుకొని పాస్ అయ్యినా:) ,ఇంఫొసిస్లో జాబ్ సంపదించి నాకంటే ముందే అమెరికాచెరుకున్న నా ప్రాణ స్నేహితుడు .ఇద్దరం కలసి పది సంవస్తరాలు అయినా ,ఆకరి రోజు మాటలు ఎక్కడ ఆపెమో అక్కడనుంచే మొదలెట్టినట్టు స్టార్ట్ చేశాం .
మరో పక్క నార్త్ కెరోలినా నుంచి వచ్చిన సుజిత్ని, సుమంత్ ఫ్రెండ్ అయిన సుబ్బుని కలవడంతో వో చిన్ని క్రికెట్ టీం తయారయింది.వచ్చివో వొన్ యియర్ అయ్యిపోవడంతో అనీలుగాడికి universal స్టూడియోకి వెల్లడం వో హాబి,దిస్నీ లాండ్ అంటే వో ఆట,వెగస్ కి వెల్లి డబ్బులు పోగొట్టు కోవడం అంటే వో సరదా:)


డిస్నీ ప్రపంచం (వరల్డ్)తో ప్రారంభించాము మా ఫైవ్ డే వెకేషన్ని.రక రకాల రైడ్లు ఎక్కడమే గాక నా ఫ్యవరైట్ యానిమేటెడ్ క్యారెక్టర్ అయిన ష్రెక్ ని కూడ కలిశాము.



చిన్నపుడు వారం అంతా వెయిట్ చేసి ఆదివారం దూర-దర్షన్లో చూసిన మిక్కి మౌస్ని డైరక్టుగా తన ఇంట్లోనే కలవటం వో తీయ్యని అనుభూతి.
'నీ ఇంటి కొచ్చా నీ నట్టింటికొచ్చా అనుకుంటూ ఫొటోలు తీసుకున్నాం:)'



LA నుంచి వేగస్ నాలుగు గంటల డ్రైవ్.అది 'one of my favourite drives' అనె చెప్పుకోవాలి.ఎందుకంటే అక్కడ స్పీడ్ లిమిట్ చాల ఎక్కువ:).ఇంకెముంది నేల తాకినా టైరు స్పీడు తగ్గని కారు.కారు అగిందంటే ఫొటోలు.యే పని చేసినా ఫొటోనే .యే పని చెస్తున్నా,పాపం మా అనిలుగాడు:).రోడ్డుకి రెండు వైపులా ఎడారి.
వేగస్ స్ట్రిప్పులోకి ఎంటర్ అవ్వగానే కల్లు జిగెల్ మనిపిస్తూ అవి బిల్డింగులా పెద్ద సైజు ట్యుబులైట్లా అనిపించింది ,అనిల్ గాడికి తప్ప మా అందరికి.


ప్రతి కెసీనోకీ వో హొటెల్తో పాటు వో తీం కూడా వుంటుంది.సీసర్స్ ప్యాలస్ ఐతె ఈజిప్టులోని రోము మహా నగరములా,నివ్యార్క్ నివ్యార్క్ ఐతె వొ మిని సైజు నివ్యార్క్ లానే వుంటుంది.

మా మంకీ మందకి తగ్గటే సర్కస్-సర్కస్ హొటెల్లో రూములు బుక్ చేశాడు అనిలుగాడు.
స్లాట్ మెషీన్ల నుంచ్చీ పోకర్ వరకూ ,బ్లాక్ జాక్ నుంచీ రోలెట్ వరకూ అన్నింటిలోనూ మా అద్రుష్టాన్ని పరీక్షించుకొంటూ కెసీనోలన్నీ తిరిగేశాం.

వేగస్ అంటెనే నైట్ లైఫ్ .కెసినోలో బ్రోకర్లకి కాసేపు రెస్ట్ ఇచ్చి బయటకు వస్తే సీసర్స్ ప్యాలస్ దగ్గర డ్యన్సింగ్ ఫౌంటైన్ చూస్తూ అరగంట సెపు అలానే వుండి పోయాము.

వెగస్కి వెల్లి శ్ట్రాటోస్పియర్ ఎక్కకపోతే తిరుమలకి వెల్లి లడ్డు తిననట్టే:).



వంద ఫ్లోర్ల పైన హొటెల్లో కూర్చొని వెగస్ని చూడడమే కాదు అంత ఎత్తున మల్లి రైడ్లు కూడ ఎక్కెయొచ్చు.

హాసిని డ్రైవర్ లేడు:)

X-Scream:- బిల్డింగ్ కి చిట్ట చివరకి తీసుకొచ్చి అపేస్తాడంతే!!

Insanity:-వేగస్ మొత్తం చిన్నిదిగా కనిపిస్తూ వుంటే,మనల్నిఆకాశాంలోకి విసిరి వేసి నట్టూ అనిపిస్తుంది.

Big Shot:- వంద ఫ్లోర్ల పైన అల్లి బిల్లి ఆట:).ఆపండ్రోయ్ అంటే అక్కడే ఆపేస్తారని ,గమ్మునే వున్నా వో రెండు క్షనాలు అక్కడే ఆపేశారు.రోడ్డు పైన కార్లు,బిల్డింగ్లు, లెగోస్తో కట్టీన బొమ్మల్లా చిన్ని చిన్నిగా కనిపిస్తుంటే మాకు ఆకాశంలో చుక్కలు నేల మీదే కనిపించాయి:).

ఒక్కొ రైడు అయిదు సార్లు ఎక్కితే గాని తనివి తీరలేదు మాకు:)

ఇలా రెండు రోజులు రెండు రాత్రులు వేగస్ కెసినోల స్టాక్ వ్యాలువ్ పెంచి ,మా పర్సుల బరువు తగ్గించుకోని,మరచిపోలెని ఎన్నో అనుభవలని బ్యాగ్లలో ప్యాక్ చేసుకొని కొత్త స్నెహితులతో కలసి గ్ర్యాండ్ కెన్యాన్ కి బయలుదేరాము.


Related Articles


Florida Part 2:Miami The Paradise


UK Visitor Visa for non US Citizens in USA


Hasinis Day Out


Florida Part 1:Six days in Orlando

Texas:Take 8


F.E.A.R:-Forget Everything And Ride!!


Niagara Falls With West Coast Gang


Little Rock ,Arkansas


Wild Wild West 2


Dance in Delaware


Austin Texas


First Ski


Kerala


Denver The Mile High City


Ocean City